విద్యుత్‌ శాఖలో కొలువుల జాతర

4

– 422 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

– పైరవీలకు తావులేదు

– మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి):

తెలంగాణలో ఉద్యోగాల నియమాక పరీక్షలలో, తుది ఎంపిక లో ఎక్కడా బ్రోకర్లకు అవకాశం లేకుండా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎంపిక పక్రియ పూర్తి చేస్తుందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి చెప్పారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పూర్తి పారదర్శకంగా , ఎలాంటి విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా పనిచేస్తుందని ఆయన చెప్పారు. కొత్తగా 1422 ఎఇఇ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తున్నామని, నవంబర్‌ ఎనిమిదిన వారికి పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. డిసెంబర్లో ఉద్యోగాల భర్తీ పూర్తి అవుతుందని జగదీష్‌ రెడ్డి చెప్పారు. విద్యుత్‌శాఖలో పోస్టుల భర్తీలో బ్రోకర్లు, పైరవీలకు ఆస్కారం లేదన్నారు. అలాంటిదేక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందు కోసం మొబైల్‌ నెంబర్‌ను ఏర్పాటు చేశామని ఎవరైనా అభ్యర్థులను ప్రలోభ పెడుతున్నట్టు తెలిస్తే మొబైల్‌ నెంబర్‌ 8332983914కు ఫోన్‌ చేయాలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హతగల అభ్యర్థులందరూ కష్టపడి చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగల కొరత కారంణంగా ట్రాన్స్‌కోలో ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయాల్సి వస్తోందని అందుకే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేశామని తెలిపారు. 2018 నాటికి రాష్ట్రాన్ని విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఇందులో ఎలాంటి సందేహంలేదని వెల్లడించారు. ట్రాన్స్‌మిషన్‌, డిస్టిబ్య్రూషన్‌ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు ఎంత విద్యుత్‌ అవసరమవుతుందో అంచనా వేస్తున్నారని తెలిపారు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రానివ్వమని ధీమాతో చెప్పారు. విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతామని ఎన్నికల మేనిఫెస్టోలో హావిూ ఇచ్చిన మేరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.  విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ఇవాళ 1422 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు భర్తీ పక్రియను ప్రారంభిస్తున్నామని తెలిపారు. జెన్‌కో-419 పోస్టులు, ఎలక్ట్రికల్‌, సివిల్‌-172, ఎలక్టాన్రిక్స్‌-70, మెకానికల్‌-195 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ట్రాన్స్‌కోలో 124 ఎలక్ట్రికల్‌, 22 సివిల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలవుతుందని పేర్కొన్నారు. ట్రాన్స్‌కోలో 184 ఎలక్ట్రికల్‌, 22 సివిల్‌ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ఎస్‌పీడీసీఎల్‌-201, ఎన్‌పీడీసీఎల్‌-159మొత్తం 963 ఎలక్ట్రికల్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. జేఎన్డీయూ ఆధ్వర్యంలో పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించారు. మెకానికల్‌ 195 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. డిసెంబర్‌లోగా నియామకాల పక్రియ పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగాలకు కొత్తగా ఎన్నికైన అభ్యర్తులందరూ జవనరి 1 నుంచి అందరూ విధుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఎన్‌పీడీసీఎల్‌ అభ్యర్థులకు నవంబర్‌ 8న పరీక్ష జరుగుతుందని తెలిపారు. జెన్‌కో అభ్యర్థులకు నవంబర్‌ 14న, నవంబర్‌ 22న ఎస్‌పీడీసీఎల్‌ అభ్యర్థులకు, నవంబర్‌ 29న ట్రాన్స్‌కో అభ్యర్థులకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. వివరాలన్ని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పని చేస్తోందని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడరాదని మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ రైతాంగానికి కొన్ని సమస్యలున్న మాట వాస్తవమేనని , సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. మావోయిస్టుల నుంచి తనకు ఎలాంటి లేఖలు రాలేదని , మావోయిస్టుల డిమాండ్లను తాము అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.