విద్యుత్ షాక్‌కు గురై లైన్‌మెన్ మృతి
కడప, జూలై 29 : మైదుకూరు మండలం అక్కులాయపల్లి గ్రామ పొలిమెర్లలో నర్సింహులు (40) అనే లైన్‌మెన్ విద్యుదాఘాతానికి గురై ఆదివారం మృతి చెందారు. అక్కులాయపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు వనిపెంట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా అక్కులాయపల్లి పొలంలో విద్యుత్ మరమ్మతుకు వెళ్లారు. ఇనుప కరెంట్ స్తంభాన్ని ఎక్కేందుకు ప్రయత్నించారు. విద్యుత్ స్తంభానికి విద్యుత్ సరఫరా అవుతుండడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనాస్థలాన్ని ఎడి రమణారెడ్డి సందర్శించారు. లైన్‌మెన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు.