విద్యుత్ ఏఈ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచులు….

హార్టికల్చర్, వైద్య ఆరోగ్య
శాఖల పనితీరుపై అసహనం…
ఫోటో రైటప్: అధికారులు నిలదీస్తున్న ప్రజా ప్రతినిధులు..
 వరంగల్ బ్యూరో అక్టోబర్ 12 జనం సాక్షి
    విద్యుత్ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించాల్సి ఉండగా గ్రామాల్లో అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా జరుగుచుండగా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుగ్గండి మండల సర్వసభ్య సమావేశం ఏఈ సురేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అసహనాన్ని ప్రకటించారు.
బుధవారం వరంగల్ జిల్లా  దుగ్గొండి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం దుగ్గొండి ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండల సభ విద్యుత్ ఏఈ సురేష్ పై మండిపడ్డారు. హార్టికల్చర్ వైద్య ఆరోగ్య శాఖ ల పనితీరుపై ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.
.మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధిపై గతంలో జరిగిన తీర్మానాలు ప్రస్తుతం జరగవలసిన అభివృద్ధి పనుల తీర్మానాలపై చర్చలు జరిగాయి. మండలంలో ఉద్యానవన సంబంధించిన పంటలు అధికంగా సాగుతున్న నేపథ్యంలో సలహాలు సూచనల కోసం సమాచారం తెలుసుకోవడానికి  హార్టికల్చర్ అధికారులు మండలంలో ఉన్నారు లేదో అనే సందేశం నెలకొన్నదని పలువు సర్పంచులు వాపోయారు. కనీసం ఫోన్ ద్వారా నైనా సమాచారం తెలుసుకుందామంటే స్పందించేవారు కరువయ్యారని తెలిపారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను నేటికీ ప్రభుత్వం ఆదుకోలేదని, అర్హులైన గౌడ చేనేత కార్మికులకు ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వడం లేదంటూ మల్లంపల్లి సర్పంచ్ రమేష్ ప్లకార్డ్ తో నిరసన వ్యక్తం చేశారు.విద్యుత్ సరఫరా పట్ల గ్రామాల్లో నిత్యం తీవ్ర అంతరాయం కలుగుతుందని,వినియోగదారుల నుండి సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తు సర్వీస్ మాత్రం ఇవ్వడం లేదంటూ, ఏనాడూ సంబంధిత అధికారులు సమస్యలు పరిష్కారం చేస్తాలేరని, అధికారుల పనితీరు మాటల్లో మాత్రమే ఉన్నదని చేతల్లో లేదని సర్పంచులు విద్యాసాగర్ గౌడ్,రమేష్,రాజేశ్వర్ రావు ,ఎంపిటిసిలు ఏఈ సురేష్ ను ప్రశ్నించారు.ఎద్దు ఏడ్చిన ఎవసం,రైతు ఏడ్చిన దేశం బాగుపడదనె సామెతలగా మండలంలో విద్యుత్ సమస్యల పట్ల
 అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ప్రజాప్రతినిధులు ఏఈ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా  ఏఈ సురేష్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో  సిబ్బంది సమస్యలు ఎక్కువగా ఉన్నదని, మండలంలో ఎలాంటి విద్యుత్  సమస్యలు లేవని   సమాధానం చెప్పారు.అనంతరం ప్రజాప్రతినిధులు విస్తుత్ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో థర్డ్ వైర్,లూజ్ వైర్ల సమస్యలు అధికంగా ఉన్నాయని సర్పంచ్లు తెలుపగా నెల రోజుల్లో సమస్యలు తీరుస్తానని మండల సభ కు ఏఈ హామీ ఇచ్చారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని,రెండు సంవత్సరాల అభివృద్ధి నిధులు వెనకకు పోయాయి అందుకు కారణం అధికారులు కాదా అని సర్పంచ్ చుక్క రమేష్ వైద్య ఆరోగ్య అధికారులను ప్రశ్నించగా అప్పటి వైద్యాధికారి నిర్లక్ష్యంతో నిధులు పోయాయని దుగ్గొండి వైద్య అధికారులు తెలిపారు.
పారిశుధ్య నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకపోవడం కమిటీ అధ్యక్షులు ఎంపిపి నిర్లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా అని సర్పంచ్ రమేష్ అడిగారు.కేశవపురం పిహెచ్సి పరిధిలో పారిశుధ్య నిధుల పట్ల వైద్యాధికారి డాక్టర్ స్వప్న,ఎంపిపి కోమల మధ్య సంభాషణ జరుగుతుండగా మల్లంపల్లి సర్పంచ్ జోక్యం చేసుకోవడంతో సభలో తీవ్ర వాగ్వివాదం జరిగింది.ఈ నేపథ్యంలో క్షమాపణలు చెప్పుతెనే సమావేశం కొనసాగుతుందని ఎంపిటిసిలు తేల్చిచెప్పడంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడారు అనే వాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సర్పంచ్ రమేష్ తెలుపడంతో వాగ్వాదం సర్డుమనిగింది. మండల అభివృద్ధి కోసం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు అభివృద్ధి పట్ల ఏ ఒక్కరు నోరు ఇవ్వకపోవడంతో సభలో నిరాశ ఏర్పడింది. ఈ సందర్భంగా ఎంపీపీ కోమల మాట్లాడుతూ మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారులతో పూర్తిస్థాయిలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపిఓ శ్రీదర్ గౌడ్,డీటీ హుస్సేన్,పిఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, పశు వైద్య అధికారులు రామ్మోహన్,శారదా,ఎస్సారెస్పీ డీఈ రామకృష్ణ,ఎంఈఓ సత్యనారాయణ, ఏపిఎం రాజకుమార్, ఏఈవోలు రాజేష్, హనుమంతు,
ఎంపిటిసిలు పిండి కుమారస్వామి,బండి జగన్నాథం,రాజు,సుమన్,మమత,లావణ్య,అరుణ,కో ఆప్షన్ సభ్యులు ఎండి అబ్దుల్ రజాక్,
సర్పంచులు రమాదేవి,సునీత,పాండవుల సురేష్, తిరుపతిరెడ్డి,నారాయణరెడ్డి,మోగ్గం మహేందర్,సొసైటీ చైర్మన్లు ఊరటి మైపాల్ రెడ్డి, బట్టు పైడి,ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.