విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పంటలకు అందని నీరు

* విద్యుత్ సబ్ స్టేషన్ కు తాళం వేసిన రైతులు,
* రోడ్డుపై రాస్తారోకో,
ఖానాపురం ఆగష్టు 29జనం సాక్షి
 విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు మోటార్లకు విద్యుత్ అందక పంటలకు నీరు అందడం లేదనే అశోక్ నగర్ పర్శ తండా దబ్బీర్ పేట రైతులు అశోక్ నగర్ గ్రామం లోని సబ్ స్టేషన్ కు తాళం వేసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అశోక్ నగర్ సబ్ స్టేషన్ లో
పాఖాల్ ఫిడర్, దబీర్ పేట ఫీడర్ కు సగం సగం కరెంటు ఇవ్వడం వల్ల కరెంటు  సరిపోక వ్యవసాయ పంటలకు సరిపడా కరెంటు అందక రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికీ కరెంటు మోటార్ వందకు పైగా సరిగా నడవక కరెంటు వచ్చి పోవడంతో కాలిపోయాయి అని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటులో సమస్య లేదు  సబ్ స్టేషన్ స్టేషన లోనే సమస్య ఉంది అన్నారు .తెలంగాణ ప్రభుత్వం 24గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తుంటే  అశోక్ నగర్ లో ఉన్న  సబ్ స్టేషన్ నుండి రైతుల పంట పొలాలకు సరిపడా కరెంటు ఇవ్వడం లేదని గత ఐదుఆరు నెలలుగా సమస్యలు పట్టించుకోమని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఏఈ కు సబ్ స్టేషన్ ఇంచార్జి లకు తెలిపిన కనీసం పట్టించుకోకుండా రేపు వస్తది మాపుస్తంది అని దాటి వేస్తున్నారు,నాణ్యమైన కరెంటు ఉన్నా కూడా అందించడం లేదని ఏఈ, డిఈ  వెంటనే ఇక్కడికి వచ్చి సమస్య పరిష్కరించాలని రోడ్డుపై  రైతులు ధర్నా చేసి సబ్ స్టేషన్ కు తాళం వేశారు. ఇట్టి విషయంపై కరెంట్ ఏఈ సంపత్ వివరణ కోరగా  మా పై అధికారి ఏడిఈ తో మాట్లాడి వెంటనే అ సమస్య ను పరిష్కారం ఇస్తామని  అని అన్నారు. వెంటనే స్పందించినఏ డి ఈ అశోక్ నగర్ సబ్ స్టేషన్ కు వచ్చి  ఏడిఈ  అమృ నాయక్ కు  రైతుల సమస్య గుర్తించి మరల ఇలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని అన్నారు.
 ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముంజల సాయిలు, ముద్దంగుల కోమ్మలు, జినుకాల సురేష్, రేపాక మల్లయ్య, శంకర్, రవి,పర్ష తండా రైతులు పాల్గొన్నారు.