విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (17)
జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో
విద్యుత్ శాఖతో హమాలి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కాసగోని మొగిలి (48) జమ్మికుంట లో ఎఫ్ సి ఐ లో హమాలీగా పనిచేస్తున్నాడు. ఇంటి ముందర రేకులు సరి చేసే క్రమంలో విద్యుత్ షాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ముల్కనూర్ ఎస్ఐ,ఎ, ప్రవీణ్ కుమార్ తెలిపారు.