విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
అదిలాబాద్,ఫిబ్రవరి28(జనంసాక్షి): ఇంద్రవెల్లి మండలం వడగా పంచాయతీ పరిధిలోని డోంగర్ గ్రామంలో శనివారం విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమయింది. గ్రామంలో విద్యుత్ తీగలు వేలాడుతుండటంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు మేకలు, సిల్కొండ శంకర్‌కు చెందిన ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమయింది. రూ. 40వేల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతో గ్రామస్థులు మంటలను ఆర్పివేశారు.



