విద్య వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

సంతలో సరుకుగా విద్యావ్యవస్థ విధానం

-పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడుకుందాం

కురవి అక్టోబర్20: (జనం సాక్షి న్యూస్)

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు కురవి మండల మహాసభను గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. పిడిఎఫ్ జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ అధ్యక్షతన జరిగిన సభలో టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ సార్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి దేశెట్టి రామచంద్రయ్య లు, మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థపై మూకుముడిగా దాడి చేస్తున్నాయని, సామాజిక అంశమైన విద్యను వ్యాపార సరుకుగా మారుస్తున్నాయని ప్రైవేటు యూనివర్సిటీలను రాష్ట్రంలో ప్రవేశ పెడుతూ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు కొమ్ముగాస్తు ప్రభుత్వ విద్యరంగాన్ని నీరు కలుస్తున్నారని ప్రభుత్వ విద్య వ్యవస్థ దెబ్బ తినడం మూలన పేద విద్యార్థులకు విద్యాదూరం అవుతుందని అన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ర్యాంకుల వెంట పరుగులు పెట్టించి మానసిక ఒత్తిడికి గురి చేస్తూ వారిని బలి బలి తీసుకుంటున్నాయని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నాయని ఎన్నిసార్లు సమస్యలు విన్నవించిన ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో ఒకే మతానికి కొమ్ముకాసే విధంగా విద్య వ్యవస్థను తయారు చేస్తున్నాయని ఇలాంటి తరుణంలో విద్యారంగాలలోని సమస్యలపై పాలక ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్య వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జు దేవేందర్, టిపిటిఎఫ్ మండల నాయకులు వీరభద్రం, యాదగిరి, బిక్షపతి, రాంబాబు, నవీన్, చిరు, ప్రదీప్, నవ్య, అఖిల్, స్వప్న, శేఖర్, సుసుమిత, తదితరులు పాల్గొన్నారు.