విధి నిర్వహణలో సూపర్వైజర్లు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి: జిఎం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 29( జనం సాక్షి): మణుగూరు పైలెట్ కాలనీ ఎంవిటిసి శిక్షణ కేంద్రం నందు రెండు వారాల పాటు జరిగిన రెండవ బ్యాచ్ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల స్ట్రక్చర్ శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏరియా జనరల్ మేనేజర్ జి. వెంకటేశ్వర రెడ్డి పాల్గొనీ మాట్లాడుతూ పని ప్రదేశాలలో సూపర్వైజర్ల విధి నిర్వహణ ఎంతో బాధ్యతతో కూడుకున్నది. క్షేత్ర స్థాయిలో కార్మికులు పనిలో రక్షణ పరికరాలు ధరించి రక్షణ పరిధిలో పనిచేసిలా కనిపెట్టడం తో పాటు పని ప్రదేశంలో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలను ముందుగానే పసిగట్టి ప్రమాదాలను నివారించగలగాలి. సింగరేణి యజమాన్యం ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల డ్యూటీ యొక్క ప్రముఖ్యాన్ని గుర్తించి ఇలాంటి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది . ఈ శిక్షణ తరగతుల ద్వారా నేర్చుకున్న అత్యాధునిక సాంకేతిక రక్షణ పద్దతులను తమ తమ విధులలో కచ్చితంగా పాటిస్తూ తాము పని చేసి గనితో పాటు మణుగూరు ఏరియా లో ప్రమాదాలు యెప్పటికి సున్నా స్థాయిలో ఉండేలా నిబద్ధత తో కూడిన వృత్తి నైపుణ్యత ప్రద్పర్శించాలని జనరల్ మేనేజర్ సూచించారు. ఈ సందర్భంగా మణుగూరు ఏరియా హాస్పిటల్ వైద్యులు ఆరోగ్య విషయాలపై శిక్షణ తో పాటు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. డాక్టర్ నాగరాజు ఈనెల 31న పదవి విరమణ పొందుతున్న సంధర్భంగా జి ఎం చేతుల మీదుగా ఎంవిటిసి సిబ్బంధి సన్మానం చేశారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఓ టు జి ఎం లలిత్ కుమార్ . రమేశ్ డీజీఎం (పర్సనల్), ఎంవిటిసి మేనేజర్ నాగేశ్వర రావు , డాక్టర్ నాగరాజు , అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మణ్ , టిబిజికెఎస్ నాయకులు . ప్రభాకర్ , కోట శ్రీనివాస్ రావు , విటిసి అద్యపకులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.