విధులు బహిష్కరించిన ఎంజీఎం పీజీ విద్యార్థులు

వరంగల్‌, జనంసాక్షి: గత మూడు నెలలుగా ప్రభుత్వం స్టైఫండ్‌ చెల్లించడం లేదంటూ ఎంజీఎం ఆసుపత్రిలోని పీజీ వైద్య విద్యార్థులు శనివారం ఆందోళన బాట పట్టారు. వారు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పీజీ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగటంతో వైద్య అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.