వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

cp-mahender-reddy25వేల మంది పోలీసులు.. 12వేల సీసీ కెమేరాలు

గ్రేటర్ పరిధిలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిపేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 25 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. శోభయాత్ర సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీపీ స్పష్టం చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచామన్నారు. వంద షీ టీమ్ లను అందుబాటులో ఉంచామన్నారు.

ఇక శోభ యాత్ర జరిగే ప్రతి రూట్ లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ తెలిపారు. నగరవ్యాప్తంగా దాదాపు 12 వేల సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామని సీపీ స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతాను పర్వావేక్షిస్తామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ చుట్టూ 51 క్రేన్లను ఏర్పాటు చేసామన్న సీపీ.. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు.

ఇక ఉదయం 5 గంటల నుంచే నిమజ్జన ఏర్పాట్లు చేసుకోవాలని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాత్రి 12 గంటల లోపు వచ్చిన విగ్రహాలనే నిమజ్జనం చేస్తామన్నారు. 12 దాటిన తర్వాత వచ్చే విగ్రహాలను తెల్లారి నిమజ్జనం చేస్తామన్నారు. ఇందుకే వీలైనంత ముందుగానే భక్తులు నిమజ్జనానికి రావాలని సీపీ పిలుపునిచ్చారు. ఇక ట్యాంక్ బండ్ కు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు సైతం చేశామన్నారు.
ఇక నిమజ్జనం సందర్భంగా ప్రజలుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు చేసామని సీపీ స్పష్టం చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేశామన్నారు.. రేపు సిటిలోకి జిల్లాల నుంచి ఎలాంటి భారీ వాహానాలు ఎంటర్ అవకుండా జాగ్రతలు చేపట్టామని సీపీ తెలిపారు.

మొత్తానికి గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిపేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రజలంతా సహకరించాలని సీపీ కోరారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూమ్ కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.