వినాయక వేడుకల్లో బాణాసంచాకు అనుమతి లేదు

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి):  నగరంలో వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాలు, రహదారులపై బాణాసంచా కాల్చొద్దని, దీనిపై నిషేధం విధించినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. ఈ నిషేధం 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 12 రాత్రి వరకు అమల్లో ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతియుత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని నగర ప్రజలకు సీపీ అంజనీ కుమార్‌ పిలుపునిచ్చారు.