విను వీధులు.. వీర వనాలు

ఆకాశాన్ని తాకనున్న అతివల హర్షం
ఎంగిలి పూలతో సంబరం ఆరంభం
శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 25 ఎగిలివారంగా తొలి మంచు కురువంగా.. ఆ.. మంచు బిందువులతో గౌరమ్మ మురవంగా.. చలికి వణుకుతున్న చేతులతో గౌరమ్మను తెంపంగా.. తొడుగు రంగురంగుల పూలను కోయంగా.. కోసిన పూలను ఒకే చోట చేర్చి నా ఆడపడుచు.. పేర్చిన ఎంగిలిపూల బతుకమ్మను సంబరంగా ఆడబిడ్డలు అంతా ఒకే చోట చేరి బతుకమ్మ.. బతుకమ్మ అంటూ.. ఆడే పాడెను ఉత్సవంగా బతుకమ్మ సంబరాలను పల్లె పల్లెల్లో ఆడబిడ్డలు జరుపుకున్నారు