విమర్శలు చేసేవారు కళ్లు తెరవాలి: చారి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): విమర్శలు చేసే వారు సిఎం కెసిఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై వివేచన చేయాలని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. ఛెస్ట్‌ ఆస్పత్రి తరలింపులో కోర్టు తీర్పు విమర్శకులకు కనువిప్పు కావాలన్నారు. ప్రతిదీ విమర్శించడం మానుకోవాలన్నారు. కోర్టు తీర్పుతో కళ్లు తెరవాలన్నారు. ప్రజోపయోగ పనులు చేపట్టాలనుకున్నప్పుడు కూడా విమర్శ చేయడం తగదన్నారు. సచివాలయం అద్భుతంగా ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నిర్మాణం చేపడితే తప్పేంటన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే సిఎం కెసిఆర్‌ ధ్యేయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పంట రుణాల మాఫీ, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు నాలుగు రేట్లు పెంచి పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ముస్లింలకు, ఎస్సీలకు కల్యాణలక్ష్మి, భూ పంపిణీ, ఉద్యోగులకు జీతభత్యాల పెంపు, మిషన్‌ కాకతీయ, జలహారం కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రజల క్షేమం కోసం సిఎం నిరంతరం శ్రమిస్తారన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని చారి అన్నారు.  తెలంగాణ ఆవిర్భావం అనంతరం తెరాస ప్రభుత్వం అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం ధ్యేయంగా చర్యలు చేపడుతోందన్నారు. అయితే కొందరు అదేపనిగా విమర్శలు చేస్తూ అడ్డుకునే పనుల్లో ఉన్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఛాతీ అస్పత్రిని ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేయడం, సచివాలయాన్ని నూతనంగా నిర్మించడం, హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన, మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌ లాంటి పనులుచేపడితే ఎక్కడ తమకు భవిష్యత్‌లో ఓట్లు దక్కవేమోనని విపక్షాలకు భయం పట్టుకుందన్నారు. ఎన్నికల సందర్భంగా తెరాస ఇచ్చిన హావిూలను ఆచరణలో పెట్టేందుకు సీఎం అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు.