విమానంలో ప్రయాణికుడికి ఉపశమనం
ప్రాథమిక చికిత్సఅందించిన గవర్నర్ తమిళసై
హైదరాబాద్,జూలై23(జనంసాక్షి): విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రాథమిక చికిత్స అందజేశారు. ఢల్లీి ` హైదరాబాద్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అర్థరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విమానం గాల్లో ఉన్న సమయంలో ప్రయాణికుడికి చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో బాధపడ్డాడు. దీంతో అప్రమత్తం అయిన విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్‌లు ఉన్నారా అని అనౌన్స్ చేశారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న గవర్నర్ వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రయాణికుడికి భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు. వెంటనే కోలుకున్న ప్రయాణికుడు చికిత్స అందించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇతర ప్రయాణికులు కూడా గవర్నర్‌ను ప్రసంసించారు. అలాగే సరైన సమయంలో స్పందించిన విమాన సిబ్బందిని గవర్నర్ అభినందించారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు తమిళిసైకు అభినందనలు తెలిపారు. గవర్నర్ తమిళిసై ప్రయాణికుడికి చికిత్స చేస్తున్న సమయంలో మరో ప్రయాణికుడు ఫోటోలు తీసి ట్విట్టర్ లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక గవ
ర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్యురాలు. ఎంబిబిఎస్, ఎండి డిజిఓ లాంటి
వైద్య విద్య కోర్సులు ఆమె చేసింది.



