విమానయాన హబ్‌గా హైదరాబాద్

హైదరాబాద్ ఏవియేషన్ హబ్‌గా రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి పీ అశోకగజపతిరాజు అన్నారు. విమాన ఇంజిన్ల తయారీలో ప్రపంచ అగ్రగామి సంస్థ ప్రాట్ అండ్ విట్నీ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో ఏర్పాటుచేసిన శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఐటీ, ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ ఇక విమానయాన హబ్‌గా మారిపోతున్నదన్నారు. రాబోయే కాలంలో ఈ కేంద్రం మరింత మందికి శిక్షణ ఇవ్వాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అంతర్జాతీయ సంస్థలు భారత దేశాన్ని ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు.