విమాన ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం
రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది ఓ వ్యక్తి నుంచి రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన హనుమంతరావు అనే వ్యక్తి విశాఖపట్నం వెళ్తోండగా ఆయన నుంచి పోలీసులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.