విర వనిత చాకలి ఐలమ్మ కు నిరజానలు అర్పించిన యంఎల్ ఏ జజల సురేందర్
ఎల్లారెడ్డి:సెప్టెంబర్10 (జనం సాక్షి) చాకలి ఐలమ్మ చేసిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా కీర్తించబడుతుందని,ఆమె పోరాటం సామాజిక ఆధునిక పరివర్తనకు నాంది అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. తెలంగాణ వీర వనిత, ధైర్య శాలిగా గుర్తింపు పొందిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శనివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వీరత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారన్నారు. తెలంగాణలో ప్రతి మహిళ చాకలి ఐలమ్మను స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, భూంగారి రాము, కో- ఆప్షన్ సభ్యులు ఎడ్ల కిషన్, ముజీబ్ ఉద్దీన్, ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్, శ్రవణ్ కుమార్ రాజ్, పోచయ్య, చింతల శంకర్, లింగం మండల రజక సంఘం నాయకులు పర్వన్న సత్యనారాయణ, చరణ్ తదితరులు పాల్గొన్నారు.