వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్ : జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్రవంతి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాది క్రితం స్రవంతికి వివాహమైంది. స్రవంతి ప్రైవేటు ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తుంది. స్రవంతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.