వివేకానంద శోభాయాత్ర
ఖమ్మం, ఫిబ్రవరి 2 (): స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన ఖమ్మంలో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు వివేకానంద ఉత్సవ కమిటీ తెలిపింది. శోభాయాత్ర 3వ తేదీ ఉదయం 9గంటలకు ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌నుంచి ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిహెచ్. కాసయ్య, రాయల నాగేశ్వరరావు, ఎల్.ప్రసాద్, ఎం.నారాయణరావు తెలిపారు.