విశాఖపై విషం చిమ్ముతున్న చంద్రబాబు
రాజధాని కాకుండా అడ్డంకులు సృష్టించే యత్నాలు
రుషికొండలో ఎలాంటి ఉల్లంఘనలు లేవు
చంద్రబాబు విమర్శలను తిప్పికొట్టిన మంత్రులు
విశాఖపట్నం/తిరుపతి,జూలై14(జనం సాక్షి : విశాఖపట్నంపై చంద్రబాబు, ఎల్లో విూడియా విషం చిమ్ముతోందని మంత్రులు మండిపడ్డారు. అదేపనిగా అబద్దాలు ప్రచారం చేయడం బాబుకు అలవాటయ్యిందని విమర్శించారు. విశాఖలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ గురువారం విూడియాతో మాట్లాడుతూ, అన్ని అనుమతులతో రుషికొండ రిసార్ట్స్‌ను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ఎక్కడ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. పర్యాటకులకు మరిన్ని ఆధునిక వసతులు కల్పించడానికి 7 స్టార్ హోటల్ తరహాలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. రుషికొండపై విశాఖకు చెందని వారితో చంద్రబాబు తప్పుడు కేసులు వేయిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇంతకన్నా దారుణం మరోటి లేదన్నారు. రుషికొండ నిర్మాణాలపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన చంద్రబాబు నాయుడుకి బుద్ధి రాలేదు. ఇప్పటికీ విశాఖకు పరిపాలన రాజధాని రాకుండా చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారు. అమరావతి కోసం విశాఖను చంద్రబాబు నాశనం చేస్తున్నారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిలో బినావిూ భూములకు రేట్లు పడిపోతాయని చంద్రబాబు భయపడుతున్నారని మంత్రి అమర్‌నాథ్ దుయ్యబట్టారు. రిషికొండలో అక్రమాలు జరిగాయని చేస్తున్న చంద్రబాబు ఆరోపణలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఇదంతా బాబు కుట్రలో భాగమని అన్నారు. చౌకబారు ఆరోపణలకు అలవాటు పడ్డ బాబు ఏదిపడితే అది మాట్లాడుతున్నారని తిరుపతిలో అన్నారు.
రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ అధినేత చంద్రబాబు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని కూడా మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఏపీలో మైనింగ్ మాఫియాకు పాల్పడిరది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. తిరుపతిలో ఆయన విూడియాతో మాట్లాడారు. కుప్పంలో జరుగుతున్న మాఫియాతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అధికారులే స్వయంగా పర్యవేక్షించి అక్రమ మైనింగ్ జరగడం లేదని తేల్చారని మంత్రి వివరించారు. కుప్పంలో టీడీపీ నాయకులే రౌడీయిజం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలోనే ఇసుకు అక్రమ రవాణా జోరుగా జరిగిందని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజున ఉన్న ఆర్థిక కష్టాల నుంచి రాష్టాన్న్రి అధిగమించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచామని ఆయన పేర్కొన్నారు.