విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం
విశాఖ ఉక్కు పోరాటంపై నిర్లక్ష్య వైఖరి
కేంద్ర నిర్ణయంపై కార్మిక సంఘాల మండిపాటు

విశాఖపట్టణం,జూలై11(జనం సాక్షి ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తుండగా, అదే స్థాయిలో కార్మికవర్గం ప్రతిఘటన ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దీనిని అడ్డుకునేందుకు అన్ని పార్టీలు రంగం సిద్దం చేస్తున్నాయి. కార్మిక సంఘాలు ఈ విషయంలో ముందున్నాయి. కేంద్రం కార్యరంగంలోకి దిగకుండా సమిష్టిగా పోరాడాలని నిర్ణయించారు. ప్రైవేటీకరణ పక్రియ సాఫీగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఆందోళనలు పట్టించుకోకుండా ముందుకే వెళ్లాలన్న
పట్టుదలలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కార్మికుల నిరాహారదీక్షలు సాగుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం వేడెక్కుతోంది. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా పోరాట కమిటీ సమాయత్తమవుతోంది. వేలాది మంది ఉద్యోగులు, కార్మికులతో ర్యాలీ నిర్వహించి తమ నిరసనలు తెలియచేస్తూనే ఉంది. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా సహకరించాలని కార్మికవర్గం కోరుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉద్యమం లో పాల్గొనాలని, రాష్టాన్రికి చెందిన ఎంపీలంతా పార్లమెంట్‌లో ఉక్కు ప్రైవేటీకరణ అంశం లెవనెత్తి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా ఒత్తిడి తేవాలని పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్ణయాలతో ఉద్యోగులు, కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎట్టి పరిస్థితు ల్లోనూ ప్రైవేటీకరణ ను అంగీకరించబోమని నినదించాయి. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే ఇక్కడ ఉద్యమం ప్రారంభమయింది. ఉక్కు కార్మిక సంఘాలు, వివిధ అసోసియేషన్లు, అధికారుల సంఘాలు కలసి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడ్డారు. రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనతో జాతీయ రహదారి దిగ్బంధం లాంటి కార్యక్రమాలు నిర్వహించిన తమ నిరసన తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగు తున్నా కేంద్రం పట్టించుకోకుండా సలహాదారుల ప్రకటన చేయడంతో పోరాట కమిటీ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢలిలీలోఊను ఆందోళనలు చేశారు. పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి రాజకీయ ప్రముఖులను కలిసి మద్దతు కూడగడతామని తెలిపారు. విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌ పోయిందంటే.. సిఎం తలపెట్టిన విశాఖ రాజధాని బోడిగుండు విూద మ్లలెపూలు పెట్టినట్టుం టుందని లెఫ్ట్‌ నేతలు ఎద్దేవా చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన, ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్‌ను కేంద్రం తెగనమ్ముతంటే సిఎం జగన్‌ ఎలా చూస్తూ ఊరుకుంటారని మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీనిపై చొరవ తీసుకోవాలని, సిఎం జగన్‌ సారథ్యం వహించి పోరాడాలన్నారు. విశాఖ కోసం అవసరమైతే హరిబాబు గవర్నర్‌ గిరి వద్దని అనాలన్నారు. అప్పుడే విశాఖ ఉక్కును కాపాడుకోగలమని అన్నారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకునే శక్తి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడుకి ఉందని ఆయన చొరవ తీసుకోవా లని, లేకపోతే ఆయన పశ్చాత్తాపపడాల్సి వస్తుందని చెప్పారు. సిఎం జగన్‌ విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నప్పుడు ఉక్కు పరిశ్రమ ఉండాలి కదా.. అని ఎద్దేవా చేశారు. మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో ఎక్కువమంది మంత్రులు జైలుకు పోయారని, కానీ మోడి ప్రభుత్వంలో 28 మంది రూ.10 లక్షల కోట్లు ఎగ్గొట్టి పోయినవాళ్లేనని, వారంతా గుజరాత్‌కు చెందినవారని, విదేశాలకు పోయి మంచిగా స్థిరపడ్డారని విమర్శించారు. ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వాన కార్యాచరణ ప్రకటించాలని, స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకునేంతవరకు కార్యాచరణ ఉండాల్సిందేనని వారు ఉద్ఘాటించారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటం చేయాలన్నారు. సీఎం జగన్‌ నేరుగా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్‌ చేశారు. విజయసాయిరెడ్డి తలచుకుంటే సమస్య పరిష్కరించ గలరని అన్నారు.