విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి మధుసూదనాచారి కృషి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ ,ఎమ్మెల్సీ మధుసూధనాచారి జన్మదిన వేడుకలను జిల్లా టీంబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షులు సలేంద్ర చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్డులో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ మధుసూదనాచారి టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి ఎన్నో పదవులు అలంకరించి అన్నిటికీ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ తహశీల్దార్ భాస్కరాచారి , రంగు దిలీప్ కుమార్ , కటకం సైదాచారి , మేడారపు బ్రహ్మచారి , ఉపేందర్, రవి , జానకి రామచారి, విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు సంఘం అధ్యక్షులు మడూరి బ్రహ్మచారి ,సభ్యులు సౌడోజు సాంబాచారి, నాగార్జున , రామాచారి తదితరులు పాల్గొన్నారు.