విశ్వవిఖ్యాత పేకింగ్ వర్సిటీలో అబ్దుల్ కలాం పాఠాలు
బీజింగ్: ఇక్కడ విశ్వవిఖ్యాత పెకింగ్ విశ్వవిద్యాలయంలో బోదించాల్సిందిగా భారత ఖిపణి శాష్త్రవేత్త, మాజి రాష్ట్రపతి అబ్దుల్ కలాంను చైనా ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ఆహ్వనం తనకెంతో ఆనందం కలిగించిందని తన కార్యక్రమాల షెడ్యూల్‌పై తదుపరి నిర్ణయం ఆదారపడి ఉంటుందన్నారు. చైనా ప్రభుత్వ మద్దతున్న మేధావుల వేదిక ‘బీజింగ్‌ఫోరం’ ఆహ్వనం మేరకు కలాం అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెకింగ్ విశ్వవిదాలయ సారధి ఝ షాన్లు గురువారం రాత్రి స్వయంగా కలాంకు తమ ఆహ్వానాన్ని అందజేశారు. ‘తాను అధ్యాపకుడిననీ అమెరికాలో పాఠాలు చెబుతా ననీ యువతను
అందజేశారు. ‘తాను అధ్యాపకుడిననీ అమెరికాలో పాఠాలు చెబుతాననీ తనకెంతో ఆనందాన్ని కల్గిస్తుందనీ ఇందుకు స్పందిస్తూ కలాం పేర్కొన్నారు. ఏడాదికొక పర్యాయం వచ్చి పాఠాలు చెప్పాల్సిందిగా కోరారనీ ఆయన కిష్టమైన అంశాన్ని బోదించాల్సిందిగా చెప్పారని కలాం కార్యదర్శి షెరిడాన్ వెల్లడించారు. అత్యంత కీలకమైన చైనీస్ అకాడమీ ఆఫ్ ఎయిర్‌స్సేస్ టెక్నాలజీని అబ్దుల్ కలాం ప్రత్యేకంగా సందర్శించారు. ప్రజల అభ్యన్నతికి భారత్-చైనాలు కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. సాప్ట్‌వేర్, సర్వీస్ రంగాల్లో భారత్ దిట్ట అనీ మాన్యూఫాక్చరింగ్‌లో చైనా తిరుగులేదని ఈ నేపథ్యంలో ఉభయదేశాలు కలిసికట్టుగా పని చేస్తే అద్భుతాలే సాధ్యమవుతాయని అబ్ధుల్‌కలాం పేర్కిన్నారు.