విషమించిన జయలలిత ఆరోగ్యం

10_thsri_jaya_2239093fతమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్‌ వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. వైద్యులు నారన్‌, తల్వార్‌, ట్రెహాన్‌, త్రిఖాలతో కూడిన ఎయిమ్స్‌ వైద్య బృందం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితకు చికిత్స అందిస్తున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మరికొద్ది సేపట్లో సమావేశం కానున్నారు. కేబినెట్‌ పిలుపు మేరకు ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నై చేరుకున్నారు. జయలలిత ఆరోగ్యం పరిస్థితిపై ఎమ్మెల్యేలు చర్చించనున్నారు.10.30 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రి ఉన్న గ్రీమ్స్‌ రోడ్డు రెండు ప్రవేశాలను బ్లాక్‌ చేశారు. వాహనాలను రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో నగరంలోని పెట్రోలు బంకులు, దుకాణాలన్నింటినీ మూసివేశారు. రాత్రి 7.30 గంటల నుంచి సామాజిక, ప్రసార మాధ్యమాల్లో జయలలిత ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు రావడంతో నగరవాసులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. బయట ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని త్వరగా ఇంటికి చేరుకోవాలని హెచ్చరించారు.