విసి నియామకం కోరుతూ మిజో స్టూడెంట్స్ ఆందోళన
ఐజ్వాల్,సెప్టెంబర్7(జనంసాక్షి): రెగ్యూలర్ వైస్ ఛైన్స్‌లర్‌ను నియమించాలని డిమాండ్ చేస్తూ మిజోరం సెట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరింది. యూనివర్సిటీకి గత రెండేళ్లుగా రెగ్యూలర్ వైస్‌ఛాన్స్‌లర్ నియామకం జరగలేదు. ఇప్పటికే పలుమార్లు విజ్ఞాపనలు చేసి విసిగిపోయిన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తరగతులను బహిష్కరించారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్‌ను క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. విద్యార్థుల ఆందోళనపై ఆ రాష్ట్ర సీఎం లాల్ తన్హవాలా స్పందిస్తూ.. వీసీ నియామకాన్ని త్వరగా చేపట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. వర్సిటీకి రెగ్యూలర్ వీసీ నియామకం చేపట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి, హెఆర్‌డీ మంత్రిత్వశాఖకు 6మే, 2016నే లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థుల భవిష్యతకు ఆటంకం కలగకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.