విూటూలో మరో జర్నలిస్ట్‌

అక్బర్‌ రేప్‌ చేశాడంటూ పల్లవి గొగోయ్‌ సంచలన ఆరోపణలు

పరస్పర అంగీకారమే అన్న అక్బర్‌

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ కేంద్ర మంత్రి,జర్నలిస్ట్‌ ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఆయన బారిన పడ్డవారు ఒక్కొక్కరే ఇప్పుడు పెదవి విప్పుతున్నారు. తాజాగా అమెరికాలో ఉంటున్న ఓ జర్నలిస్ట్‌ అక్బర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రెండు దశాబ్దాల

కిందట అక్బర్‌ తనను రేప్‌ చేశారని ఆమె వెల్లడించారు. పల్లవి గొగొయ్‌ అనే ఆ జర్నలిస్ట్‌ ప్రస్తుతం నేషనల్‌ పబ్లిక్‌ రేడియోలో ఎడిటర్‌గా పని చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట అక్బర్‌ ఏషియన్‌ ఏజ్‌ ఎడిటర్‌గా ఉన్న సమయంలో తాను జర్నలిస్ట్‌గా చేరానని, ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనను లొంగదీసుకున్నారని పల్లవి ఆరోపించారు. అక్బర్‌ తనను ఎలా వేధించారో ఆమె వాషింగ్టన్‌ పోస్ట్‌కు రాసిన ఆర్టికల్‌లో వివరించారు. తనలాగే చాలా మంది అమ్మాయిలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తనను షాక్‌కు గురి చేసిందని చెప్పారు. విూటూ ఉద్యమంలో భాగంగా అక్బర్‌పై కూడా పలువురు జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడమే గాకుంగా పరువు నష్టం కేసును వేశారు. ఈ దశలో పల్లవి ఆరోపణలు మరింత షాక్‌కు గురి చేవాయి. తాను ఎడిటోరియల్‌ పేజ్‌ ఎడిటర్‌ అయిన తర్వాత తాను రాసిన ఓ ఆర్టికల్‌ను అక్బర్‌ చూపించడానికి వెళ్లినపుడు ఆయన ఎంతగానో మెచ్చుకున్నారని పల్లవి గొగొయ్‌ చెప్పారు. అయితే ఆ వెంటనే ఆయన ప్రవర్తన మారిపోయిందని, తనకు ముద్దివ్వాల్సిందిగా వేధించారని, దీంతో ఆయనను బలవంతంగా వదిలించుకొని బయటకు వచ్చేశానని ఆమె తెలిపారు. ఈ ఘటనను ఆమె తన సహచరులకు చెప్పింది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఇలాంటిదే మరో ఘటన జరిగింది. ముంబైలోని ఓ ¬టల్లో అక్బర్‌ మరోసారి తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారని చెప్పింది. అప్పుడు కూడా ఆయనను అడ్డుకొని బయటకు వచ్చేశానని పల్లవి వెల్లడించింది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన సమయంలో ఈసారి తనను అడ్డుకుంటే జాబ్‌లో నుంచి తీసేస్తానని బెదిరించారని కూడా ఆమె తెలిపింది. ఇక మూడోసారి జైపూర్‌ ¬టల్లో ఇలాగే ఓ స్టోరీ గురించి చర్చించడానికి పిలిచి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఈసారి తాను తప్పించుకోలేక పోయానని పల్లవి చెప్పింది. అప్పట్లో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, ¬టల్‌ గదికి వెళ్లినందుకు తనను తాను నిందించుకున్నానని ఆమె తెలిపింది. కొన్ని నెలల పాటు తనను మానసికంగా, శారీరకంగా అక్బర్‌ వేధిస్తూనే ఉన్నారని, తాను పూర్తిగా నిస్సహాయురాలిగా మారిపోయానని పల్లవి ఆరోపించింది. ఆఫీస్‌లో తన వయసున్న పురుషులతో తాను మాట్లాడితే అక్బర్‌ గట్టిగా అరిచేవారని కూడా ఆమె చెప్పింది. తాను లండన్‌ ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత కూడా అక్బర్‌ వదల్లేదని, అక్కడికి కూడా వచ్చి వేధించారని, తనను కొట్టడం, తన చేతుల్లో ఏం ఉంటే వాటిని తనపై విసరడం చేసేవాడని పల్లవి వెల్లడించింది. అక్బర్‌లాంటి శక్తివంతమైన వ్యక్తుల చేతుల్లో బాధితురాలిగా మారితే ఎలా ఉంటుందో తనకు తెలుసని, తనలాగే ఆయన చేతుల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు మద్దతుగా ఇప్పుడు తానిదంతా రాస్తున్నానని ఆమె స్పష్టం చేసింది.

పరస్పర అంగీకారంతో సంబంధం నెరిపాం: అక్బర్‌

ఆరోపణలపై అక్బర్‌ స్పందించారు. అంగీకారంతోనే ఇద్దరి మధ్య సంబంధం కొనసాగిందని, అయితే దానికి మంచి ముగింపు లభించలేదని ఆయన తన విూద వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. ‘1994లో మొదలైన మా బంధం కొన్ని నెలల పాటు కొనసాగింది. అయితే అది నా కుటుంబ జీవితాన్ని ఒడుదుడుకులకు గురిచేసింది. దాంతో మా బంధం ముగిసిపోయింది. కానీ అది ప్రశాంతంగా ముగియలేదు’ అని ఆయన వెల్లడించారు. ‘మాతో పనిచేసే వారందరికి మేము సంతోషంగా ఉన్నామని అనిపించేది. అయితే ఆమె ప్రవర్తన వల్ల బలవంతంగా పనిచేస్తుందని భావించేవారేమో. వాషింగ్టన్‌ పోస్ట్‌లో నేను ఆమెపై అత్యాచారం చేసినట్లు వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమైంది. కొన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకు రావడానికి నేను దాన్ని చదవాల్సిన సందర్భం వచ్చింది’ అని ఆయన తనపై వచ్చిన ఆరోపణలను

తోసిపుచ్చారు. లైంగిక దాడికి సంబంధించిన పూర్తి వివరాలను బ్లాగ్‌లో పోస్ట్‌ చేసింది. వాటిని వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రచురించింది.