వీఆర్ఏలకు సంఘీభావం తెలిపిన ములకలపల్లి సిపిఐ పార్టీ కార్యదర్శి ఎండి యూసఫ్.
పట్వారి వ్యవస్థను రద్దు చేసినా వీఆర్ఏ వ్యవస్థను కొనసాగించిన (టిడిపి) ఎన్ టి రామారావు ప్రభుత్వం.
బూర్గంపహాడ్ సెప్టెంబర్ 05 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు 43 రోజులుగా వీ ఆర్ఏల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా సోమవారం ములకలపల్లి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి మహమ్మద్ యూసఫ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పే స్కేలును వీఆర్ఏలు కు వెంటనే అమలు పరచాలని, అర్హత గల వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు పెన్షన్ సదుపాయం కల్పించి వారి వారసులకు ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు ఆనాడు పట్వారి వ్యవస్థను తొలగించిన వి.ఆర్.ఏ ల సేవలు కొనసాగించారన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు వారు గ్రామంలో అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని ఇకనైనా ప్రభుత్వం వీఆర్ఏలకు న్యాయపరమైన కోరికలు నెరవేర్చాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటియుసి కార్మిక సంఘం అండగా నిలుస్తుందని ఆయన తెలియజేశారు.