వీఆర్ఏల దీక్షకు మద్దతుగా


రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి

నర్సీపట్నం ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :

నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు దీక్షకు మద్దతుగా రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి
జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు మాట్లాడుతూ గ్రామ వీఆర్ఏలకు సమాన పనికి సమాన వేతనం 21వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వీఆర్ఏలకు 10 వేల రూపాయలు ఇచ్చి వారి చేత వెట్టి చాకిరి చేయించు కుంటున్నారన్నారు. వీఆర్ఏల కష్టం గుర్తించి తగిన వేతనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని, వారికి అన్ని ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని, ఇండ్ల స్థలాలు, ఇండ్ల స్కీములు వి ఆర్ ఎ లకు వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, ఎస్. రాయవరం మాజీ జెడ్పిటిసి నీలాద్రి రావు, మాజీ సర్పంచ్ ఎర్రంశెట్టి అప్పారావు, వడ్డాది అప్పలనాయుడు,
బాబులు పాల్గొన్నారు.