వీఆర్ఏల న్యాయమైన డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలి –
కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకూబ్.
నర్సింహులపేట జూలై 27 జనం సాక్షి
వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినటువంటి న్యాయపరమైన డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలని కెవిపిఎస్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకుబ్ పేర్కొన్నారు. బుధవారం మండల తహసిల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు ఆయన తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అనంతరం మందుల యాకూబ్ మాట్లాడుతూ వీఆర్ఏలను పే స్కేల్ ఉద్యోగులుగా మారుస్తామని ఇచ్చిన హామీనీ కేసీఆర్ నేటి వరకు నెరవేర్చుకపోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ పెద్దలు ఆక్రమించుకోవలసిన భూములను గుర్తించడం కోసం విఆర్ఎల సేవలను వినియోగించుకొని, నేడు తెలంగాణలో కనీస వేతన చట్టాన్ని కూడా గౌరవించకుండా అహంకార పొకడతో పోతున్నా కెసిఆర్ ప్రభుత్వానికి వీఆర్ఏలు నిరవధిక సమ్మెతో తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆలోచించి వీఆర్ఏల డిమాండ్స్ పరిష్కరించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు శేఖర్, జనార్ధన్,సుధాకర్, ఎండి మల్సూర్, ధర్మారపు ఉప్పలయ్య, చైతన్య,దివ్య కెవిపిఎస్ నర్సింహులపేట మండల ఉపాధ్యక్షులు కొమ్ము మధు,మండల ప్రధాన కార్యదర్శి దూరు నవీన్,కెవిపిఎస్ నాయకులురవి,అఖిల్, సాయి ప్రకాష్,సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.