వీఆర్ఏ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.సి

.సిఐటియు మండల కన్వీనర్  నీలా రామ్మూర్తి
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: ప్రభుత్వంపై  వీఆర్ఏలు  చేస్తున్న ధర్నాకు బుధవారం సిఐటియు మండల కన్వీనర్ నీల రామ్మూర్తి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నీల రామ్మూర్తి మాట్లాడుతూ వీఆర్ఏలను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, కనీస వేతన చట్టం ప్రకారం 21వేల రూపాయిలు జీతాలు ఇవ్వాలని,అర్హులైన వీఆర్వోలకు  ప్రమోషన్లు ఇచ్చి, తాసిల్దార్ కార్యాలయంలో వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని  ముఖ్యమంత్రి చట్టసభలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు, సిఐటియు ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలియజేశాడు.ఈ కార్యక్రమంలో ఎస్.కె ఆఫీజ్, కోదాడ సైదులు, బల్లేపల్లి శీను, ఏసు తదితరులు పాల్గొన్నారు.