వీడియో కాన్ఫరెన్సు ద్వారా పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,జనవరి10(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్ను ద్వారా పుస్తకాన్ని ఆవిష్కరించారు. జైన సాధువు ఆచార్య రత్నసుందర్ సురిజి మహరాజ్ సాహెబ్ రచించిన 300వ గ్రంథాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఆవిష్కరించారు. మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిన సాహిత్య సర్కార్ సమరోహ్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు మహారాజ్ సాహెబ్ రచించిన మరు భారత్-సరు భారత్ అనే గ్రంథాన్ని విడుదల చేశారు. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో ఈ పుస్తకం ప్రచురితమైంది. ఈ సందర్భంగా 300 పుస్తకాలు రాయడం చాలా గొప్పవిషయమని ప్రధాని మోదీ అన్నారు.