వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26(జనం సాక్షి)
టీఎన్జీవో స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్, కార్యదర్శి గజే వేణుగోపాల్ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మామునూరు లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ భూమి కోసం ,భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన వీర వనిత అని వారు కొనియాడారు. రామ్ కిషన్ మాట్లాడుతూ ఆరోజు భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా నిలిచి పోరాడినటువంటి మహనీయురాలు అని వారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విక్టర్ రాణి,కార్యదర్శి గాజే వేణుగోపాల్ ,రాష్ట్ర సహధ్యక్షులు కోల రాజేష్ కుమార్, జిల్లా సహాధ్యక్షులు హేమ నాయక్, కోశాధికారి పాలకుర్తి సదానందం, ఉపాధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు, మురళీధర్ రెడ్డి , సహాయ కార్యదర్శులు తోట చందర్, వంగ రవీందర్, సిటీ అధ్యక్షులు వెలిశాల రాజు, ఏం జి ఎం అధ్యక్షులు రవికుమార్,రమేష్, గంగాధర్, మురళి,సుదర్శన్, చిరంజీవి,ఆనంద్ ,గణేష్ కాంటాక్ట్ సంఘ నాయకులు గజ్జల కుమార్, శంకేష్ రాజేష్ ,స్థానిక నాయకులు,కోటేశ్వర,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
Attachments area