వీసా గడువు ముగిసినా..
అమెరికాలో 21వేల మంది భారతీయులు
– నివేదిక విడుదల చేసిన డీహెచ్‌ఎస్
వాషింగ్టన్, ఆగస్టు8(జనం సాక్షి) : తమ వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమంగా 21వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ¬మ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్) ఇటీవల విడుదల చేసింది. వీళ్లంతా అధికారిక వీసాలతోనే అమెరికాలోకి అడుగు పెడుతున్నారని, కానీ వీసా గడువు ముగిసినా వెళ్లకుండా అక్రమంగా నివసిస్తున్నట్లు డీహెచ్‌ఎస్ వెల్లడించింది. డీహెచ్‌ఎస్ నివేదిక ప్రకారం 2017లో దాదాపు 10.7లక్షల మంది భారతీయులు బీ1, బీ2 వీసాల విూద అమెరికా వెళ్లారు. వ్యాపారం, పర్యాటకం కోసం వచ్చే వాళ్లకి ఈ వీసాలు మంజూరు చేస్తారు.
అయితే.. 14,204 మంది వీసా గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నారు. డీహెచ్‌ఎస్ నివేదిక ప్రకారం 1,708 మంది భారతీయులు తమ వీసా గడువు ముగియడంతో యూఎస్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.. కానీ మిగతా 12,498 మంది భారతీయులు మాత్రం వెళ్లిపోయినట్లు రికార్డుల్లో లేదు. 2016 ఏడాదితో పోల్చుకుంటే 2017 సంవత్సరంలోనే బీ1, బీ2 వీసాల విూద అమెరికా వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 2016లో దాదాపు 10లక్షల మంది బీ1, బీ2 వీసాల విూద అమెరికా వెళ్లారు. ఇక 2017లో ఎఫ్, జే, ఎం వీసా కేటగిరీల కింద భారతీయ విద్యార్థులు రిసెర్చ్ స్కాలర్స్ 127,435 అమెరికా వెళ్లారు. వాళ్లలో 4,400 మంది తమ వీసా గడువు ముగిసినా ఇంకా యూఎస్‌లోనే ఉంటున్నారు. ఇక వేరే విభాగాల ద్వారా భారత్ నుంచి అమెరికాకు 4.5లక్షల వలసదారులు వచ్చారు. వీరిలో 9,568 మంది వీసా ముగియగా.. 2,956 మంది యూఎస్ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక 6,612 మంది అక్రమంగా
అమెరికాలో నివసిస్తున్నట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది. భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లిన దాదాపు 7,01,900 మంది విదేశీయులు అక్రమంగా యూఎస్‌లో నివసిస్తున్నట్లు డీహెచ్‌ఎస్ వెల్లడించింది. వారిలో భారతీయుల శాతం 1.32గా ఉంది.