వృద్ధుల సంక్షేమం కోసం కృషి
నిజామాబాద్, అక్టోబర్ 5 : ఆఫీసర్స్ క్లబ్‌లో ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు వైద్య ఆరోగ్య కాంపును ప్రారంభించి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్థు మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటగానే వృద్ధాప్యం వచ్చిందని బాధపడవద్దని, ప్రతి నిత్యం సంతోషంగా ఉండడానికి సామాజిక సేవ చేస్తే, ఆరోగ్యానికి దోహదపడుతుందని, వృద్దుల సంక్షేమం కొరకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్‌టీసీలో రాయితీలు, రైల్వే రాయితీలు, పెన్షన్లు, అభయహాస్తం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు. వృద్ధులకు ఆరోగ్యపరమైన సలహాలు ఇవ్వడానికి 30మంది డాక్టర్లతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ అభ్యున్నతికి ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్న అడగవచ్చునని సూచించారు. అనంతరం వయో వృద్ధులైన వెంకట్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, సింహాచలం, జైనినెహ్రు, లక్ష్మికాంతం, రాంచర్‌రావు, గడ్డముత్తన్న, దేవతి గంగారాం, కోట లక్ష్మారెడ్డి, గొల్ల ప్రసాద్‌రావు, జాకీరుద్దీన్, ఆకుపత్రి జయపూర్ణ కలెక్టర్ చేతులు మీదుగా సన్మానం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డియం అండ్ హెచ్‌ఓ హరినాథ్, డిసిహెచ్‌ఎస్ తులసిబాయి, స్టెప్ సిఇఓ సాయిలు, మెప్మా పిడి సత్యనారాయణ, ఎన్‌సిఎల్‌పి పిఓ సుధాకర్, వికలాంగ సంక్షేమ శాఖ ఎడి శర్మ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బాబురెడ్డి, మాజీ ఎంపీ నారాయణరెడ్డి, డాక్టర్ సూరి, ప్రకాష్, సిద్దయ్య, భూమన్న తదితరులు పాల్గొన్నారు.