వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేయాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్  తల్లిదండ్రుల,వయో వృద్ధుల సంక్షేమ చట్టం-2007 , దివ్యాంగుల హక్కుల చట్టం-2016 యాక్ట్ పుస్తకాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయిలో ఈ చట్టాలపై వయో వృద్దులు, దివ్యాంగులు అవగాహన కలిగి ఉండాలన్నారు.తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం, దివ్యాంగుల చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంక్షేమ శాఖని ఆదేశించారు.వయోవృద్ధుల సంక్షేమం కోసం జాతీయ వయో వృద్దుల హెల్ప్ లైన్ 14567 , దివ్యాంగుల కోసం 18005728980 హెల్ప్ లైన్ నంబర్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.ఈ హెల్ప్ లైన్ సేవలను వయో వృద్దులు,దివ్యాంగులు ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు, జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ,ఆర్డివో రాజేంద్ర కుమార్ , డిఆర్డిఓ పిడి కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఎఫ్ఆర్ఓ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
Attachments area