వెంకయ్య ఇంటి ముందు టీ లాయర్ల ఆందోళన

2
హౖెెదరాబాద్‌,మే16(జనంసాక్షి):

తెలంగాణ అడ్వొకేట్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంటిని ముట్టడించారు. శనివారం న్యాయవాదులు బంజారాహిల్స్‌లోని మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి హైకోర్టును విభజించి వెంటనే తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. గతంలో ఇక్కడికి వచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ 15 రోజుల్లో హైకోర్టు విబజనకు హావిూ ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. విబజన జరిగి 11 నెలలు పూర్తి కావస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం దారుణమన్నారు. తెలుగు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్న వెంకయ్య తెలంగాణ ప్రజలు తెలుగువారే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. స్వచ్ఛ భారత్‌ అంటే తెల్ల బట్టలు వేసుకుని ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదన్నారు. మనసులు స్వచ్చంగా పెట్టుకుని పనులు చేయాలన్నారు. విభజన తరవాత హైకోర్టు విభజనకు ఇచ్చిన హావిూలను నిలబెట్టుకుని పని చేయాలన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి లాయర్లు వినతిపత్రం అందచేశారు.