వెనుకబడిన తరగతులకూ ఉప ప్రణాళిక అమలు చేయాలి

బెల్లంపల్లి : వెనుకబడిన తరగతులకు ఉపప్రణాళికను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎస్పీ, ఎస్టీలకు అమలు చేసినట్లుగానే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపప్రణాళిను వెంటనే అమలు చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు జి. వెంకటయ్య డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మల్లాగౌడ్‌, రమేశ్‌, శ్రీనివాస్‌ , రాము, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.