వెనుకబాటుపై దృష్టి సారించండి
– లేకపోతే తెలంగాణలో గుజరాత్ తరహా నిరసనలు
– సీతారాంఎచూరి
హైదరాబాద్, ఆగష్టు 27 (జనంసాక్షి):
తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని, కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగితే.. తెలంగాణలో గుజరాత్ తరహాలో అల్లర్లు జరుగుతాయని సీపీఎం కేంద్ర కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణలో వెనుకబాటు తనంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి పెట్టకపోతే గుజరాత్ తరహా ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని ఏచూరి హెచ్చరించారు. గురువారం ఆయన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి విూడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజాసంఘాలతో కలిసి ఐక్యంగా పోటీ చేస్తామని తెలిపారు. పటేళ్ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని, పటేలళ్లపై లాఠీఛార్జీ జరపడం అమానుషమన్నారు. పటేళ్ల ఉద్యమంతో టీఎస్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలని తెలంగాణలో కూడా ఆర్థిక అసమానతలు పెరిగాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందన్నారు. గుజరాత్ మోడల్ విఫలం అయిందని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. గుజరాత్ గురించి ఎంతో ప్రచారం చేశారని, కాని ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు,హింసను గమనిస్తే, ఆ మోడల్ విఫలం అయినట్లు అర్దం అవుతుందని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక¬దా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదని, అందువల్లే కాలయాపన చేస్తోందని ఏచూరి విమర్శించారు. పికి ప్రత్యేక ¬దా ఇచ్చే ఆలోచన కేంద్రానికి ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రకటించిన బంద్‌కు తమ పార్టీ కూడా మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు. ఎపి రాజధానిలో భూ సవిూకరణ పేరుతో భూములు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీతారామ్ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దాపై కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయన్నారు. బెంగాల్ లో శాంతి భద్రతలు ఉన్యాయో లేదో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనలో మత ఘర్షణలు అధికమయ్యాయని, మత ఉద్రిక్తతలు పెంచి బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని
బీజేపీ యత్నిస్తోందన్నారు.