వెయ్యికోట్లకు పైగా పలికిన పెయింటింగ్

వెయ్యికోట్లకు పైగా పలికిన పెయింటింగ్
 న్యూయార్క్ : విశ్వవిఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన ‘ఉమెన్ ఆఫ్ అల్జీర్స్’ అనే పెయింటింగ్ రికార్డు స్థాయిలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా  పలికింది. న్యూయార్క్లోని క్రిస్టీ వేలంశాలలో ఈ పెయింటింగును వేలానికి పెట్టగా.. దానికి అక్షరాలా రూ. 1028 కోట్ల ధర పలికింది. బిడ్డింగును అనుకున్న సమయం కంటే కొంత పొడిగించినా.. గడువు ముగిసేందుకు కొన్ని నిమిషాల ముందు కూడా టెలిఫోన్లలో కొందరు కొనుగోలుదారులు ధరను పెంచుకుంటూ పోయారు.వాస్తవానికి దీనికి రూ. 900 కోట్ల స్థాయిలో మాత్రమే ధర వస్తుందని అనుకున్నారు. అయితే, వేలంశాల కమీషన్తో కలుపుకొని ఏకంగా రూ. 1152 కోట్ల ధర వచ్చింది. ‘పాయింటింగ్ మ్యాన్’ అనే పేరుతో ఆల్బెర్టో గియాకోమెటీ రూపొందించిన లైఫ్ సైజ్ బొమ్మకు రూ. 900 కోట్ల ధర పలికింది. ఇది కూడా ఆ విభాగంలో ఓ రికార్డే. అయితే, పికాసో పెయింటింగును కొన్నవాళ్లు, ఈ బొమ్మను కొన్నవాళ్లు కూడా తమ పేరు బయట పెట్టలేదు. పికాసో బొమ్మ గత పదేళ్లలో మార్కెట్లోకి వచ్చిన అన్నింటిలోకీ పికాసో బొమ్మ అత్యంత అద్భుతమైనదని ఫైన్ ఆర్ట్ ఫండ్ గ్రూపు సీఈఓ ఫిలిప్ హాఫ్మన్ అన్నారు.