వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ జట్టు

pcb
 క్రైస్ట్‌చర్చ్‌లో శనివారం జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 150 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 310 పరుగులు చేసింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరికి ముక్కీ మూలిగి 39 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. 
 ఈ ఓటమి పాకిస్థాన్ జట్టు వరుసగా రెండోది. ఈ జట్టు తొలుత భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఇపుడు వెస్టిండీస్ జట్టు చేతిలో 150 రన్స్ తేడాతో ఓటమిని చవిచూసింది. తొలుత ఒకే ఒక్క పరుగుకు నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న విషయం తెల్సిందే. దీంతో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు కూడా పెద్దగా రాణించలేక పోవడంతో పాక్ జట్టు ఓటమిని చవిచూసింది. 
 క్రైస్ట్‌చర్చ్ వేదిగగా విదేకగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ చేసి.. 310 పరుగులు చేసింది. ఆ తర్వాత 311 పరుగులు భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు… ఆదిలోనే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఫలితంగా.. అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంది. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో జంషెడ్, యూనిస్ ఖాన్, హరీస్ సోహైల్‌లు డకౌట్‌లు కాగా, షెహ్‌జద్ 1, మిస్బా ఉల్ హక్ 7, మక్సూద్ 50, ఉమర్ అక్మల్ 59, షాహిద్ ఆఫ్రిది 28, వాహబ్ రియాజ్ 3 చొప్పున పరుగులు చేశారు. 
 అంతకుముందు వెస్టిండీస్ బౌలర్ జెరోమీ టేలర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. పాక్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ నాజిర్ జంషెడ్ పెవిలియన్ చేరాడు. ఇదే ఓవర్లో యూనిస్ ఖాన్ కూడా ఔటయ్యాడు. టేలర్ తన మరుసటి ఓవర్లో హారిస్ సొహైల్ను ఔట్ చేశాడు. ఇక విండీస్ బౌలర్ హోల్డర్ ఆ తర్వాతి బంతికి హెహజాద్ను ఔట్ చేశాడు. దీంతో పాక్ ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్లు కూడా రాణించలేక పోవడంతో పాక్ జట్టు 39 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా 150 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు విజయభేరీ మోగించింది. 
 తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లందరూ సమిష్టిగా రాణించారు. శనివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్, బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొత్తం 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. వెస్టిండిస్ జట్టు స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ (4) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్లందరూ రాణించారు. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ సాధించకున్నా, రెండు అర్థ శతకాలు నమోదయ్యాయి.