వేగవంతంగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి పనులు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి
తొర్రూరు పట్టణంలోని పట్టణ ప్రగతి పనులు పలు వార్డుల్లో చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. పట్టణ ప్రగతి లో భాగంగా తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో అభివృద్ధి పనులను చేపట్టారు. చెత్త చెదారంతో పాటు పిచ్చి చెట్లను తొలగించారు.మురికి కాలువలను,రోడ్లలను శుభ్రం, చేశారు. ప్రతి వార్డులలో కూలీలను ఏర్పాటు చేసి వార్డులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు.శనివారం పట్టణంలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులను చేపట్టారు. పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న పట్టణ ప్రగతిలో భాగంగా పనులను స్థానిక పట్టణ ప్రగతి కాంట్రాక్టర్ గుంజి రవి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాల్టీ పరిధిలోని అన్ని వార్డులలో పట్టణ ప్రగతి లో భాగంగా పనులు సక్రమంగా జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, ఆర్పి లు దళితులు పాల్గొన్నారు.
Attachments area