వేతనాలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన
రంగారెడ్డి: తాండూరు : పంచాయితీ కార్మికులకు చెల్లించే వేతనాలను ప్రతినెల సక్రమంగా చెల్లించాల్సిందిగా కోరుతూ సోమవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. చెల్లించే అరకొర వేతనాలను సైతం నెలల తరబడి బకాయి ఉంచుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇక మీదట నెలానెలా వేతన చెల్లింపులకు కృషి చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అనంతరం ప్రజాదర్భారులో ఉన్న ఎమ్డీఓ మోహన్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మండలంలోని వివిధ గ్రామాల పంచాయితీ కార్మికులు పాల్గొన్నారు.