-->

వేములపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం


* 14 ఆవులు మృత్యువాత
* ఘటనాస్థలికి చేరుకున్న ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, జనం సాక్షి.
మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలోని బుగ్గబావిగూడెం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో 14 ఆవులు మృత్యువాతపడ్డాయి. రోడ్డుకు ఇరువైపులా నిర్జీవంగా పడివున్న ఆవులను చూసి దారిన వెళ్తున్న రోడ్డువాహనదారులు సైతం చలించిపోయారు. రోడ్డు ప్రమాదం గురించి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకున్న శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఘటనాస్థలాన్ని సందర్శించారు. రోడ్డు ప్రమాదం ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, అనిరెడ్డి నాగలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ సైదులు, తదితరులు ఉన్నారు.