వేములపల్లిలో వైద్య శిబిరం
దంతాలపల్లి సెప్టెంబర్ 7 జనం సాక్షి
మండలంలోని వేములపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి వసంత ముఖ్యఅతిథిగా పాల్గొనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ వేదకిరణ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.వైద్య శిబిరంలో మొత్తం 68 మందిని పరీక్షించి అవసరమైన వారికి మందులు అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ బాలాజీ, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎం సుభద్ర, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.