వేములవాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడ,జనవరి22(జ‌నంసాక్షి):  దక్షిణకాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ
రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు.  వసంతపంచమికి తోడు సోమవారం కావడంతో వేకువ జామునుంచే దర్శనం కోసం భక్తులు తరలి వచ్చారు.  స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు చేరుకున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిట లాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకుని గర్భగుడిలో దర్శనాలు, ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామచంద్రమూర్తి, అనంత పద్మనాభస్వామి, శ్రీ సోమేశ్వరాలయంలో దర్శనాలు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గండదీపంలో నూనె పోసి గండాలు పోవాలని మొక్కుకున్నారు. భారీ సంఖ్యలో తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరో వారం రోజుల్లో మేడాజాతరం ప్రారంభం కానుండటంతో ఇప్పటికే భక్తులు భారీ సంఖ్యలో మేడారం చేరుకుంటున్నారు. దీనిలో భాంగా మార్గం మధ్యలో వేముడులను దర్శించుకుంటున్నారు. దీంతో భక్తుల తాకిడి వేముల ఆలయానికి భారీగా పెరిగింది. ద్యార్థులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇవో దూస రాజేశ్వర్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.