వేములవాడలో పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి జాతర సమీపిస్తుండటంతో పాటు సోమవారం కలిసిరావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న భక్తులు..స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ధర్మగుండంలో పవిత్రస్నానమాచరించి తడిగుడ్డలతో కోడెమొక్కులను చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా రాజన్న దర్శనానికి ఆరుగంటల సమయం పడుతోంది. మరోవైపు భక్తుల రాకతో పాటు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన వసతులు కల్పించారు.