వేములవాడలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల,సెప్టెంబర్‌4  జనం సాక్షి   : వేములవాడ రాజన్న ఆలయాలనికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా వారు తొలుత ఆలయ కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల విూదుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సోమవారం మామూలుగానే రద్దీ ఉంటుంది. అయితే శ్రావణమాసం కూడా కావడంతో భక్తుల రాక పెరిగింది.