వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం
కరీంనగర్, మే 26 : నేషనల్ గ్రీన్‌కోర్, వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కళారంగాల్లో బాల వేసవి శిక్షణాతరగతులు శనివారం జవహర్ బాల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఎన్జీసీ వారు బాలలకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 50 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. పెయింట్‌ంగ్ పోటీిల అనంతరం జరిగిన కార్యక్రమానికి నేషనల్ గ్రీన్‌కోర్ ప్రాజెక్టు అధికారి బి.విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో నేషన్‌ల్ గ్రీన్ క్రాఫ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య అవశ్యకత గురించి వారికి అవగాహన కల్పించారు.బాలవికాస సమితి వ్యవస్థాపకులు వావిలాల భూపతిరెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం ద్వారానే జీవకోటి మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ బాల కేంద్ర పర్యవేక్షకుడు కేవీ గోవిందాచారి, డ్రాయింగ్ మాస్టర్లు, ఆర్.లక్ష్మణాచారి, పవన్ కుమార్, బాలల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నరు.