వైఎస్‌ఆర్ సీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటి
హైదరాబాద్, జనంసాక్షి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం పార్టీ కేంద్ర కార్యలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరారెడ్డి, సోమయాజులుతో పాటు అందుబాటులో ఉన్ననేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం. తెలంగాణలో విజయమ్మ పర్యటన తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం .