వైఎస్‌ అవినీతిపై చర్చిండానికి సిద్థం : కవిత

నిజామాబాద్‌: వైకాపా నేత షర్మిలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. తెలంగాణపై ఇప్పటి వరకూ స్పష్టమైన వైఖరి చెప్పకుండా వైకాపా నేతలు ఆడ్డగోలు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును రూ. 17 వేల కోట్లతో నిర్మిస్తామని చెప్పి.. మూడు నెలల్లో అంచనా వ్యయాన్ని 38 వేల కోట్లకు పెంచినప్పుడు అనాటి ముఖ్యమంత్రి  వైఎస్‌కు వచ్చిన వాటా ఎంతో  చెప్పాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. వైఎస్‌ అవినీతిపై చర్చించడానికి తాను సిద్ధమని సవాలు విసిరారు.